బడంగ్ పేట్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి..బంగారం, నగదు చోరీ

by Sumithra |
బడంగ్ పేట్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి..బంగారం, నగదు చోరీ
X

దిశ, మీర్ పేట్ : ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బంగారం నగదు దోచుకెల్లిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కె కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వెంకటాద్రి నగర్ బడంగ్ పేట్ లో నివాసముంటున్న సాపటేల్ల వెంకటప్ప తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా సొంత గ్రామానికి వెళ్ళారు. మరుసటి రోజు మధ్యాహ్న సమయాన ఇంటికి వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళం హుక్కు విరగగొట్టి ఉంది.

అది గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 9.5 తులాల బంగారు వస్తువులు, కొంత నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు గుర్తించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, అలాగే ప్రజలు ఇంటి దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇండ్లలో ఎవరు లేని సమయంలో బంగారు వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని త్వరలో నేరస్తులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed