Brutal Murders: రాష్ట్రంలో భయానక ఘటన.. ఐదుగురి దారుణ హత్య

by Shiva |
Brutal Murders: రాష్ట్రంలో భయానక ఘటన.. ఐదుగురి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్‌కు బానిసై ఓ యువకుడు కుటుంబంలోని ఐదుగురిని గంటల వ్యవధిలోనే హతమార్చిన భయానక ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలోని తిరువనంతపురం (Thiruvananthapuram)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అఫాన్ (23) అనే యువకుడు విచ్చలవిడిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే అఫాన్ (Afan) మత్తులో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకుందే తడవుగా మొదట నిందితుడు పాంగోడ్‌ (Pangod)కు చెందిన తన నాన్నమ్మ సల్మా బీవీ (Salma Bivi)ని ఉదయం హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి మరొక గ్రామమైన ఎస్ఎన్‌ పురం (SN Puram)లో తండ్రి రహీం సోదరుడు లతీఫ్ (Latif), అతడి భార్య షాహిదా (Shahida)లను హతమార్చాడు.

అక్కడితో ఆగకుండా తన సొంత గ్రామం పుల్లంపర (Pullampara)కు వెళ్లి అతడి 13 ఏళ్ల తమ్ముడు అఫ్సాన్ (Afsan), మరో మహిళ ఫర్సానా (Farsana)తో పాటు స్నేహితుడిని కొట్టి చంపేశాడు. హత్యల అనంతరం నిందితుడు వెంజమూడు పోలీస్ స్టేషన్‌ (Venjamudu Police Station)కు వెళ్లి నేరం ఒప్పుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే, అఫాన్ (Afan) దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి తల్లి షెమీ (Shemi) గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఈ మేరకు తిరువనంతపురం (Thiruvananthapuram) మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
Next Story

Most Viewed