- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నంద్యాల జిల్లాలో నాటు బాంబుల కలకలం
దిశ, నందికొట్కూరు : నంద్యాల జిల్లాలోని పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు, సోషల్ మీడియా కన్వీనర్ బోయ మధు ఇంట్లో మంగళవారం నాటు బాంబులు లభ్యమయ్యాయి. ఆయన ఇంటిపైన ఉన్న సింటెక్ ట్యాంక్‌లో రెండు కవర్లలో 22 నాటు బాంబులు లభించాయి. సింటెక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ నాటు బాంబులు బయటపడ్డాయి. వెంటనే ఇంటి యజమాని బోయ మధు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు 22 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు వాటర్ సింటెక్స్‌లో బాంబులు ఎవరు ఉంచారనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఈ బాంబులు ట్యాంకులోకి ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీయగా ఎవరు పెట్టారో తెలియదని, పిల్లలకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చి దురద పెడుతుందని చెప్పడంతో ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లానని, అందులో మూట దొరికిందని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. అయితే ఏడాది క్రితం ఇదే ఇంటిలో గంజాయి మూటలున్నాయని అప్పట్లో మరో వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇళ్లంతా గాలించినా పోలీసులు నీళ్ల ట్యాంకును చెక్ చేయలేదని వివరించారు.