నాగార్జునసాగర్ ఎడమ కాలువలో జూనియర్ అసిస్టెంట్ మృతదేహం..

by Sumithra |
నాగార్జునసాగర్ ఎడమ కాలువలో జూనియర్ అసిస్టెంట్ మృతదేహం..
X

దిశ, మిర్యాలగూడ/ వేములపల్లి : రెండు రోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలో అదృశ్యమైన యువకుడు వేములపల్లి మండల సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మృతదేహం గురువారం లభ్యమయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం మండలం బెజికల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ మిర్యాలగూడ తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. కాగా రెండు రోజుల క్రితం స్కూటీ పై రెడ్డి కాలనీ ఇంటి నుంచి బయలుదేరాడు.

రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద స్కూటీ పార్క్ చేసి ఉండడం గమనించిన పోలీసులు యువకుడి ఆచూకీ కోసం సాగర్ ఎడమకాలువ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గురువారం మధ్యాహ్నం దొండవారి గూడెం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమకాలువలో మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది.


Next Story

Most Viewed