Attempted Murder: ప్రేమోన్మాది ఘాతుకం.. డిగ్రీ విద్యార్థినిపై విచక్షణారహితంగా కత్తితో దాడి

by Shiva |   ( Updated:2024-11-04 05:41:56.0  )
Attempted Murder: ప్రేమోన్మాది ఘాతుకం.. డిగ్రీ విద్యార్థినిపై విచక్షణారహితంగా కత్తితో దాడి
X

దిశ, వెబ్‌‌డెస్క్/మెదక్ ప్రతినిధి: డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలే ఓ ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన విషాద ఘటన మెదక్ పట్టణం (Medak Town)లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన దివ్యవాణి (Divyavani) ఓపెన్ డిగ్రీ పరీక్ష (Open Degree Exams)లు రాసేందుకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College)కు వచ్చింది. మెదక్ పక్కనే ఉన్న అవుసుల‌పల్లి గ్రామంలో బంధువుల వద్ద ఉంటూ పరీక్షలు రాస్తోంది. అయితే, కొన్నాళ్ల నుంచి దివ్యవాణి (Divyavani)ని బెంగళూరు (Bagaluru)కు చెందిన చేతన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

తన ప్రేమను అంగీకరించలేదన్న కోపం‌తో యువతిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న దివ్యవాణి వద్దకు వెళ్లిన చేతన్ మొదట ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను పగలగొట్టాడు. అనంతరం తన వెంట తీసుకొవచ్చిన కత్తి‌తో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దుర్ఘటనలో యువతి చేతికి తీవ్ర గాయం కాగా.. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad) తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మెదక్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




Advertisement

Next Story