మైనర్ బాలికపై లైంగికదాడి

by Javid Pasha |   ( Updated:2023-06-20 14:37:02.0  )
మైనర్ బాలికపై లైంగికదాడి
X

దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల మడలం గంజల్లా గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. బాలికకు మాయమాటలు చెప్పి ఓ మహిళ మైనర్ బాలికను తన భర్త దగ్గరకు తీసుకెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త బాలికపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఇంట్లో నుంచి పరరారయ్యాడు. బాలికను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.

గ్రామస్తులు, బాలిక బంధువులు గోనెగండ్ల లో రోడ్డు పై బైఠాయించి నిందితులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.కేసులు పెట్టి కాలయాపన చేయరాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నిందితులు భార్య బోడెమ్మ, భర్త బడేసాబ్ పై పొక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

గొలుసులతో కట్టేసి అత్యాచారం.. పూర్ణానంద స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 ఏళ్ల బాలిక..!

Advertisement

Next Story