జూకల్ లో దారుణం.. వ్యక్తి దారుణ హత్య

by Kalyani |
జూకల్ లో దారుణం.. వ్యక్తి దారుణ హత్య
X

దిశ, శంషాబాద్: మామిడి తోటలో వాచ్ మెన్ ఉన్న వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరాజు (48), నాగమణి భార్యభర్తలు జూకల్ గ్రామ పరిధిలోని మామిడితోటలో వాచ్ మెన్ గా ఉంటున్నారు. వీరి కుమారుడు శ్రీనివాస్ రాజు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శ కోర్టులో మామిడి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. కాగా శ్రీనివాస్ రాజు తన తండ్రి వెంకటరాజుకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో శ్రీనివాస్ రాజు జూకల్ లోని మామిడి తోటకు వెళ్లి చూడగా అప్పటికే వెంకటరాజు రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించాడు.

ఇది ఇలా ఉండగా ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెంకటరాజును కొడుతండగా భార్య నాగమణి అరవడంతో ఆమెను కొట్టి ముఖంపై స్ప్రే కొట్టడంతో స్పృహ కోల్పోయింది. తరువాత పదునైన ఆయుధంతో వెంకటరాజు ముఖం, మెడపై పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story