భర్త, అత్తను చంపి.. ముక్కలుగా నరికి

by Javid Pasha |   ( Updated:2023-02-20 14:10:25.0  )
భర్త, అత్తను చంపి.. ముక్కలుగా నరికి
X

న్యూఢిల్లీ: దేశంలో శ్రద్ధా హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ తరహా ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అసోంలో ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భార్య ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను చంపేసింది. అంతటితో ఆగకుండా వారి మృతదేహాలను ముక్కలు చేసి మూడు రోజుల పాటు ఫ్రిడ్జిలో ఉంచి దూరప్రాంతంలో పడేశారు. అత్త సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులుకు అసలు నిజాలు బయటకు వచ్చాయి.

జిమ్ ట్రైనర్ అయిన వందన కలిత తన నిరుద్యోగి అయిన భర్త అమర్ జ్యోతి దేయ్, అత్త శంకరి దేయ్‌ను ప్రియుడు ధంతి దేకా, మరో వ్యక్తి సహాయంతో హతమార్చినట్లు వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మృతదేహాలను ముక్కలుగా చేసి మేఘాలయాలో పడవేసినట్లు చెప్పారు. వీరిని ఆ ప్రాంతానికి తీసుకెళ్లి శరీర భాగాలను గుర్తించారు. గతేడాది జూలై 27న అత్తను, ఆగస్టు 17న భర్తను హత్య చేసినట్లు తేలింది. తన భర్త కనిపించట్లేదని కలిత కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Read more:

ఉదయం పూట 'ఆ పని' చేయడం మంచిది కాదా?

29 ఏళ్లలో పెరిగిన పురుషాంగం పరిమాణం.. కానీ.. ఎలా?

Advertisement

Next Story