గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్..

by Aamani |
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్..
X

దిశ,మంథని : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పట్టుకుని మంథని పోలీసులు అరెస్ట్ చేశారు. మంథని ఎస్సై రమేష్ నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు మగ వ్యక్తులు నిషేధిత గంజా అక్రమంగా కలిగి ఉన్నారని సమాచారం రాగా సిబ్బందితో కలిసి కుచి రాజ్ పల్లి గ్రామ శివారులో గల బాలాజీ రియల్ ఎస్టేట్ ప్లాట్ నందు,గెస్ట్ హౌస్ వద్ద అనుమానాస్పదంగా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా చేతిలో నీలం రంగు కవర్ తో ఉన్నారు.ఆ వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని కవర్ లో ఏముంది అని అడుగగా ఎండిపోయిన మొగ్గలు పువ్వులు గల గంజాయి ఉన్నది అని తెలిపారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తన పేరు నక్క ప్రేమస్ (24), అతని వద్ద నీలం రంగు పాలిథిన్ కవర్ లో గల మరొక ముదురు నీలం రంగు కవర్ లో గంజాయి ఉందని తెలిపాడు.

తనకు గత 5 సంవత్సరాల నుంచి గంజాయి తాగే అలవాటు ఉందని,తనతో పాటు స్నేహితుడు అయిన లక్కీ పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అర్సత్ కి కూడా గంజాయి తాగే అలవాటు ఉందని తము ఇద్దరు పలుమార్లు కలిసి గంజాయి కొనుక్కుని వచ్చి కొంత మేము తాగడం మిగిలినది చిన్న చిన్న పాకెట్స్ చేసి,ఒక్కోక్క ప్యాకెట్ ధర రూ 500 అమ్మి డబ్బులు పంచుకునే వాళ్ళమని అన్నారు.ఇరవై రోజుల కిందట సమీర్ సిరివంచ మండలం, మహారాష్ట్ర అను అతని వద్ద రెండు కిలోల గంజాయి ని కొనుక్కొని వచ్చి మా స్నేహితులైన రత్న బన్నీ,కళ్యాణ్, శివ,రమేష్ లకు కొంత గంజాయిని అమ్మి,మిగిలిన గంజాయి మా వద్ద ఉంచుకొని అందులో కొంత మేము తాగుదామని,ఎవరికైనా అమ్ముదామని వచ్చామని తెలిపారు.వెంటనే వారిని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మంథని సీఐ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed