Arrest: మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్..

by Shiva |   ( Updated:2024-12-05 05:37:31.0  )
Arrest: మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌ రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రా‌వును ఇవాళ ఉదయం బంజారా‌హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బుధవారం తన ఫోన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఇంటలిజెన్స్ ఐజీ శివధర్‌ రెడ్డి (Shivadhar Reddy) ట్యాప్ చేస్తున్నారంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) ఫిర్యాదు చేసేందుకు బంజారా‌హిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన వెళ్లేసరికి సీఐ అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో కలిసి స్టేషన్‌లో హంగామా చేశారు. అయితే, తమ విధులకు భంగం కలిగిస్తున్నారంటూ సీఐ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డి (Koushik Reddy), అనుచరులపై కేసు నమోదైంది. ఈ మేరకు ఇవాళ కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారం మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు కొండాపూర్‌‌కు వెళ్లారు. అయితే, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో సహా అరెస్ట్‌ను అడ్డుకున్న హరీశ్‌రావు, బీఆర్ఎస్ కార్యకర్తలను సైతం బంజారా‌హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Next Story

Most Viewed