కూనో నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి

by Satheesh |
కూనో నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్య ప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి చెందింది. దేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను దేశానికి తీసుకువచ్చింది. వీటిలో నెలల వ్యవధిలోనే రెండు చీతాలు ప్రాణాలు విడవగా తాజాగా ఆరేళ్ల మగ చీతా ఉదయ్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కిడ్నీ సమస్యతో మార్చి 27న ఐదేళ్ల ఆడ చీతా సాషా మృతి చెందింది. వరుసగా చీతాలు మృత్యువాత పడటం జంతు ప్రేమికులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో చీతాలను ఉంచడానికి కూనో పార్కుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రదేశాన్ని ఎంపిక చేయాలని మధ్యప్రదేశ్ అటవీశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed