- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుపాయల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..
by Sumithra |
X
దిశ, పాపన్నపేట : మండల పరిధిలోని ఏడుపాయల ఆలయ సమీపంలోని చెక్ డ్యామ్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైనట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం చెక్ డ్యామ్ లో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహం లభమైంది. మృతదేహం పై పసుపురంగు టీషర్ట్ పై నలుపు, తెలుపు గీతలు ఉన్నాయని తెలిపారు.
దీంతో పాటు నల్లటి డ్రాయర్ ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఆనవాలను బట్టి ఎగువ ప్రాంతంలో నుండి కొట్టుకు వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. మూడు నుండి ఐదు రోజుల క్రితం మరణించి ఉంటారని ప్రాథమిక అంచనా వేసినట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని ఆయన తెలిపారు.
Advertisement
Next Story