MLA Rajasinghకు మళ్లీ నోటీసులు!

by Sathputhe Rajesh |   ( Updated:31 Jan 2023 4:35 AM  )
MLA Rajasinghకు మళ్లీ నోటీసులు!
X

దిశ, వెబ్ డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు మంగళవారం మళ్లీ నోటీసులు జారీ చేశారు. ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనవద్దని రాజాసింగ్‌పై బెయిల్ షరతులు ఉండగా షరతులు ఉల్లంఘించారని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రాజాసింగ్ షరతులు ఉల్లంఘించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముంబైలో జరిగిన సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు. తెలంగాణ పోలీసులు రాజాసింగ్‌పై ఇటీవల పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసులో షరతులతో ఇటీవల రాజాసింగ్ విడుదలయ్యారు. మళ్లీ మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు.

Also Read...

అర్ధరాత్రి మంచం కోసం దంపతుల మధ్య గొడవ.. స్నేహితురాలితో కలిసి షాకిచ్చిన భార్య

Next Story

Most Viewed