- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Triple Death Mystery: ప్లాన్ ప్రకారమే పోలీసుల సూసైడ్..? బయటపడ్డ ఆ ఇద్దరి వాట్సప్ చాటింగ్?

దిశ, వెబ్‌డెస్క్: భిక్కనూర్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముందస్తు ప్లాన్‌తోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బయటపడ్డ వాట్సప్ చాటింగ్‌లో పోలీసులు కీలక అంశాలను గుర్తించినట్లు జిల్లాల్లో ప్రచారం జరుగుతోంది. వారం రోజులుగా వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లో ఈ విషయాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. అయితే ఎస్ఐ దగ్గర ఉన్న మూడు ఫోన్లలో ఒక్కటి మాత్రమే లాక్ ఓపెన్ కాగా.. మిగతా రెండింటిని పోలీసులు ఇప్పటి వరకు తెరవలేకపోయారు. ఆ ఫోన్ చాటింగ్ బయటపడితే అసలు కేసు చిక్కుముడి వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్డంకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ముగ్గురు కూడా నీటిలో మునగడంతోనే చనిపోయారని పోస్ట్ మార్టం నివేదిక వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురి దేహాలపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించినట్లు సమాచారం. అయితే ముగ్గురు ఒకే సమయంలో చనిపోయారా లేక ఒకరిని కాపాడబోయి మరొకరు ప్రాణాలు తీసుకున్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆత్మహత్యకు ముందు లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మధ్య జరిగిన సంభాషణ చాటింగ్ ఒకటి బయటపడ్డట్టు తెలుస్తోంది.
కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చాటింగ్‌లో ఆత్మహత్య చేసుకునే ప్రస్తావన వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు కూడా.. నేను ఆత్మహత్య చేసుకుంటానంటే.. నేనూ చేసుకుంటానని చాట్ చేసుకున్నారని, చివరికి ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందాం అనుకున్నట్లు చాటింగ్‌లో బయటపడింది. దీన్ని బట్టి చనిపోవడానికి వీరిద్దరి సిద్ధపడే చెరువు దగ్గరకు వెళ్లినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ఈనెల 26 మధ్యాహ్నం 1:26 గంటలకు ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు భిక్కనూర్ పోలీస్ స్టేషన్ నుంచి సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి చెరువు వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే వీరిద్దరి ఫోన్లతోపాటు ఎస్ఐ దగ్గర ఉన్న మూడు ఫోన్లను ఓపెన్ చేసి చాటింగ్ డేటాను విశ్లేషించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎస్ఐ ఫోన్లు ఓపెన్ అయితే డెత్ మిస్టరీ బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, ఈనెల 26న అర్థరాత్రి భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్(Bhikkanur SI Saikumar), బీబీపేట్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి(Bibipet Lady Constable Shruti), కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (Computer Operator Nikhil)లు ముగ్గురు కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక అసలు కారణాలు తెలియక కేసు మిస్టరీలా మారడంతో ఉన్నతాధికారులు ఈ కేసులో నిజా నిజాలు తెలుసుకోవడానికి సదాశివ్‌నగర్ సీఐ సంతోష్‌ను విచారణాధికారిగా నియమించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ముగ్గురి డెత్ మిస్టరీపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతూ ట్విస్ట్‌లు ఇస్తుండటం గమనార్హం.