- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం
వేర్వేరు ఘటనల్లో ఐదుగురికి గాయాలు
దిశ, కామారెడ్డి రూరల్ : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై పలువరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల కథనం మేరకు.. ఫ్యాక్టరీలో నిత్యం కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ఫ్యాక్టరీ యజమాన్యం కార్మికులు పని చేసే వద్ద కనీసం ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను తీవ్ర గాయాలు పాలు చేస్తుంది.
ఇందుకు నిదర్శనం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనలే ఇందకు ఉదాహరణ. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన దొందడి కుమార్, అదే గ్రామంలో నివాసం ఉంటున్న రమేష్ లకు వాటర్ ఫ్రెషింగ్ వద్ద గాయాలయ్యాయి. అలాగే బైలర్ వద్ద బికాస్ మిస్ ఫైర్ కావడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో సదాశివనగర్ లో నివాసం ఉంటున్న శంకర్ తో పాటు అంబర్ సింగ్, దేవయ్య గాయల పాలయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించిగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఉంది. గతంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికుడు మరణిస్తే ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు ఫ్యాక్టరీ యాజమాన్యం తుంగలో తొక్కిందని కార్మికుల ఆరోపిస్తున్నారు.