లిఫ్ట్ ఇస్తానంటూ బైక్ ఎక్కించుకున్నాడు.. కొంతదూరం వెళ్లాక ఏమైందంటే?

by sudharani |   ( Updated:2022-09-03 10:11:04.0  )
లిఫ్ట్ ఇస్తానంటూ బైక్ ఎక్కించుకున్నాడు.. కొంతదూరం వెళ్లాక ఏమైందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు సాయం చేస్తామంటూ మాయమాటలతో నమ్మిస్తున్నారు. నమ్మి వెళితే జీవితాలను నాసనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులోని వివేకానగర పోలీస్ స్టేసన్ పరిధిలో చోటు చేసుకుంది.

25 ఏళ్ల ఓ యువతి గురువారం రాత్రి హొస్కూరు రహదారిలో ఒంటరిగా నిలబడి ఉంది. ఆ యువతిని గమ్య స్థానానికి చేరుస్తానంటూ ఓ యువకుడు నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. కొంత దూరం చేరుకోగానే ఆ యువకుడు నీచపు బుధ్ది బయటపడింది. తన స్నేహితుడితో కలిసి ఆ యువతిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతి తక్కువ సమయంలోనే ఆ ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story