చెట్టుకు ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య..

by Sumithra |
చెట్టుకు ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య..
X

దిశ, తానూర్ : మహారాష్ట్రలోని దివిసి గ్రామానికి చెందిన ఉస్కెవాడ్ గజానంద్ (25) మహలింగి గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దివిసి చెందిన ఉస్కేవాడ్ అనుసుటబాయి కుమారుడు గజానంద్ మండలంలోని మహాలింగి గ్రామంలో అత్తమ్మ గుండ్ల మౌనబాయి దగ్గర ఉండేవాడు.

మంగళవారం మధ్యాహ్నం మహాలింగి గ్రామం నుండి మహారాష్ట్రలోని దివిసి గ్రామానికి వెళ్తానని అత్తమ్మ మౌనబాయికి చెప్పి బయలు దేరాడు. దివిసి గ్రామంలో మృతుడు తల్లి అనసూయబాయికి గజానంద్ వచ్చాడని పొన్ లో అడగగా రాలేదని సమాధానం ఇచ్చింది. దీంతో కుటుంబసభ్యులు బుదవారం ఉదయం గాలించగా గ్రామానికి దగ్గరలో ఉన్న గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డడు తెలుసుకున్నారు. మృతుడు తల్లి ఉస్కేవాడ్ అనసూయబాయి ఫఇర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed