- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమోన్మాది అరెస్ట్.. ప్రేమను నిరాకరించిందని యువతి పై దాడి..
దిశ, కంది : తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఓ ప్రేమోన్మాది డిగ్రీ విద్యార్థిని పై బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. యువతి పై బ్లేడుతో దాడి చేసిన నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి వెల్లడించారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనూర్ మండలానికి చెందిన అఖిల ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. గతంలో ఓ మీసేవ కేంద్రంలో అఖిలకు నారాయణఖేడ్ మండలం ర్యకాల పోతాంగల్ కు చెందిన ప్రవీణ్ కుమార్ (22)తో పరిచయం ఏర్పడింది.
అప్పటినుండి నిందితుడు ప్రవీణ్ తనను ప్రేమించాలని అఖిలను వేధింపులకు గురిచేస్తూ వస్తున్నాడు. అతని బాధ భరించలేక యువతి హైదరాబాదుకు వెళ్ళింది. కాగా బుధవారం ఆమె సెకెండియర్ పరీక్ష రాసేందుకు సంగారెడ్డిలోని తార డిగ్రీ కళాశాలకు వస్తుందని తెలుసుకున్న ప్రవీణ్ తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానంటూ బ్లేడ్ తో దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు దాడిని అడ్డుకొని ప్రవీణ్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు అఖిలను పరీక్ష రాసేందుకు కళాశాలలోకి పంపించారు. దాడికి పాల్పడ్డ నిందితుడు ప్రవీణ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు డీఎస్పీ వివరించారు.