దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

by Sathputhe Rajesh |
దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కట్టుకున్న భర్తనే చంపిన ఓ ఇల్లాలు అతను కనిపించడం లేదంటూ నమ్మించేందుకు యత్నించి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎంవీపీ కాలనీ సమీప వాసవానిపాలేనికి చెందిన జ్యోతికి, వలందపేటకు చెందిన పైడిరాజు(28)తో ఆరేళ్ల కింద్ర పెళ్లయింది. వీరికి బాలాజీ(5), హర్షిత(3) అనే పిల్లలు ఉన్నారు. అయితే జ్యోతికి పెళ్లికి ముందు నుంచే వాసవాని పాలెం కు చెందిన నూకరాజు(25)తో పరిచయం ఉంది. కాగా ఇటీవల వీళ్లు మళ్లి కలుసుకోవడం ప్రారంభించారు.

అత్తవారిది ఉమ్మడి కుటుంబం కావడంతో కలుసుకోవడం కుదరదని విశాలాక్షినగర్ లో ఓ గది అద్దెకు తీసుకున్నారు. అయితే జ్యోతి సీబీఐ కార్యాలయంలో హౌస్ కీపింగ్ పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి నమ్మించి ఆరు నెలలుగా ప్రియుడి గదికి వెళ్లేది. అయితే భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించి గత నెల 29న పైడిరాజుకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. రాత్రి ప్రియుడితో కలిసి మెడకు తీగ బిగించి హతమార్చింది. మృతదేహాన్ని పెద జాలారిపేట సమీప వాసవానిపాలెం శ్మశాన వాటికలో దహనం చేసింది. బూడిదను సముద్రంలో కలిపి ఇంటికి వచ్చింది. భర్త కనిపిండం లేదంటూ భీమిలి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. మృతుడి సోదరులు జ్యోతి ప్రవర్తనపై అనుమానం వ్యక్తంగా పోలీసులు తమదైన శైలిలో విచారించారు. భర్తను తామే హత్యచేశామని నేరాన్ని ఒప్పుకుంది.

Advertisement

Next Story