- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం..ఇద్దరు చిన్నారులు మృతి..
దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం కేంద్రంలోని తెలంగాణ సెంటర్ లో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగపేట మండలంలోని కొత్తూరు మోట్లగూడ గ్రామపంచాయతీ పరిధిలో శ్రీరాం నగర్ గోత్తి కోయగూడెంకు చెందిన మడవి సురేష్, మడవి చిన్నారి దంపతుల కుమారుడు నవీన్, కుమార్తె ఇలాషా ద్విచక్ర వాహనం పై కోమటిపల్లి క్రాస్ నుంచి మంగపేటకు వెళ్తుండగా మంగపేట బస్టాండు నుండి హన్మకొండకు వెళ్తున్న బస్సు తెలంగాణ సెంటర్ లో ఢీ కొంది.
ఈ ప్రమాదంలో మడవి సురేష్, చిన్నారి దంపతులతో, పాటు ఇద్దరు పిల్లలు బైక్ తో సహా బస్సు కింద పడడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 కి, మంగపేట పోలీసులకు సమాచారం అందించి గాయపడిన వారిని మంగపేట ప్రభుత్వా అసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని, గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం అని, రహదారుల పై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి అని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.