- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నదిలో పడి గొర్రెల కాపరి మృతి
by Shiva |

X
దిశ, బీర్కూర్ : నదిలో పడి ఓ గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన బీర్కూర్ మండల కేంద్రంలోని మంజీరా నదిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం పెద్దనగర్ (బి) గ్రామానికి చెందిన వాసర ఉల్లిగొండ(18) అనే యువకుడు గొర్రెలను మేపుకుంటూ బీర్కూర్ మండల కేంద్రానికి వచ్చాడు. శనివారం మధ్నాహ్నం తన గొర్రెలకు నీరు తాగించేందుకు మంజీరా నదిలో దించాడు. మంజీరా నదిలో చెక్ డ్యాం కోసం ఇసుక తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. యువకుడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు గజ ఈతగాళ్ల సాయం తీసుకుంటున్నట్లు ఎస్సై బాల్ రెడ్డి తెలిపారు.
Next Story