ఆ యువకుని మృతికి అదే కారణం..

by Sumithra |
ఆ యువకుని మృతికి అదే కారణం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా స్థంభం పైనే అతడి ప్రాణాలు పోయిన విషాద ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆదర్శనగర్ కాలనీలో ఓ ప్రైవేటు వెంచర్లో శ్రావణ్ అనే ప్రైవేటు ఎలక్ట్రిషియన్ శనివారం సాయంత్రం విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి ఫిట్స్ రావడంతో స్తంభంపైనే మృతిచెందాడని వెంచర్ నిర్వాహకులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై విద్యుత్ శాఖ డీఈ వెంకటరమణని వివరణ కోరగా కరెంటు షాక్ తో మృతి చెందలేదని, వెంచర్ వారు ప్రయివేటుగా పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రైవేట్ వెంచర్ లో విద్యుత్ స్తంభం పై మరమ్మత్తులను ఎల్సీ తీసుకోకుండా ఎలా మరమ్మతులు చేస్తున్నారని, దానికి అధికారుల వద్ద సమాధానం లేదు. విధ్యుత్ శాఖలో లైన్మెన్ లు పనిచేయకుండా హెల్పర్ ల సాయంతో పని చేస్తున్న విషయం తెలిసిందే. కరెంట్ షాక్ తో మృతి చెందకపోతే విద్యుత్ స్తంభంపై వేలాడుతున్న శ్రావణ్ ను ఎందుకు కిందికి దించలేదనేది నిర్వాకులు చెప్పలేకపోతున్నారు. శ్రావణ్ చేతులకు కాళ్లకు కలిగిన గాయాలను చూస్తే కరెంట్ షాక్ తో మృతి చెందినట్టు స్పష్టమవుతుంది. ప్రైవేట్ వెంచర్ నిర్వాహకుడు ఒక పార్టీ నాయకుడు కావడంతోనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed