జేపీ నడ్డా పీఏనంటూ ఎమ్మెల్యేలకు బురిడీ

by Javid Pasha |   ( Updated:2023-05-18 13:47:07.0  )
జేపీ నడ్డా పీఏనంటూ ఎమ్మెల్యేలకు బురిడీ
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు పర్సనల్ అసిస్టెంట్ ను అంటూ ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించాడు. బండారం బయట పడటంతో కటకటాలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని మోర్బీకి చెందిన నీరజ్ సింగ్ అనే వ్యక్తి మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు వికాస్ కంభారే, టెక్ చంద్ సావర్కర్, తానాజీ ముట్కులే, నారాయణ కుచెలను సంప్రదించాడు. తాను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యక్తిగత సహాయకుడినంటూ నమ్మించాడు. త్వరలో మహారాష్ట్ర కేబినేట్ విస్తరణ జరగనుందని, నడ్డాతో చెప్పి సదరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పిస్తానని ఆశ కల్పించాడు. ఈ క్రమంలోనే అచ్ఛం నడ్డాలాగే మాట్లాడే ఓ వ్యక్తితో ఈ ఎమ్మెల్యేలను మాట్లాడిపించాడు.

దీంతో నిజమని నమ్మిన సదరు ఎమ్మెల్యేలు అతడికి కొంత డబ్బును కూడా ముట్టజెప్పారు. అయితే ఇటీవల నీరజ్ సింగ్.. ఎమ్మెల్యే వికాస్ కుంభారేకు ఫోన్ చేసి గుజరాత్ లో ఓ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని, అందుకు డబ్బు కావాలని అడిగాడు. అయితే అతడిపై అనుమానం రావడంతో సదరు ఎమ్మెల్యే నాగ్ పూర్ లోని కొత్వార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్ 419, 420, 511 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీరజ్ సింగ్ వ్యవహారంపై కూపీ లాగడంతో అతడు చెప్పింది ఫేక్ అనే అసలు నిజయం బయటపడింది. జేపీ నడ్డా పీఏ నంటూ అతడు తమను మోసం చేశాడని సదరు ఎమ్మెల్యేలు గ్రహించారు.

Also Read..

'దేశం విడిచి వెళ్లిపోండి'.. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ వార్నింగ్

Advertisement

Next Story