జమ్మూ కశ్మీర్‌లో మరోసారి టార్గెట్ కిల్లింగ్.. తుపాకులతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

by Satheesh |
జమ్మూ కశ్మీర్‌లో మరోసారి టార్గెట్ కిల్లింగ్.. తుపాకులతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకాశ్మీర్‌లో మరో టార్గెట్ హత్య జరిగింది. కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అచన్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ సంజయ్ శర్మ(40)గా పోలీసులు గుర్తించారు. కాల్పుల్లో సంజయ్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే సంజయ్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.

జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన కాశీనాథ్ శర్మ కుమారుడు సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సంజయ్ పండిట్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆయనను ఉగ్రవాదులు చంపేశారని, ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆయన ఆత్మీయులందరికీ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story