- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిట్యాలలో వ్యక్తి దారుణ హత్య..
by Sumithra |
X
దిశ, చిట్యాల : చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65 నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో మృతి చెంది ఉన్న వ్యక్తిని చిట్యాల పోలీసులు ఉదయం గుర్తించారు. మృతుని వద్ద లభించిన ఉద్యోగి గుర్తింపు కార్డు ఆధారంగా మృతుడు ఆర్ఎస్వీ ప్రసాద్ (సుమారు 50) హైదరాబాద్ లోని గాంధీనగర్ లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.
గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని దుండగులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులచే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన వివరాలు, హత్య చేసిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story