వంతెన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా

by Sridhar Babu |
వంతెన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా
X

దిశ, ఘట్కేసర్ : పట్టణ కేంద్రంలోని వంతెన నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు తాను పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని కోదండరాం సందర్శించారు. 14వ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వంతెన విషయం తనకు తెలుసునని.. ఇది చాలా జఠిలమైన సమస్య అని అన్నారు. వంతెన నిర్మాణం ఆలస్యం కావడానికి ప్రభుత్వాన్ని నిందించడం సరైనది కాదని అన్నారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టణ ప్రజలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు మారం లక్ష్మారెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story