తన ఆలనాపాలనా చూసేవారు లేరని ఆత్మహత్య

by Sridhar Babu |
తన ఆలనాపాలనా చూసేవారు లేరని ఆత్మహత్య
X

దిశ, జూలూరుపాడు : తన ఆలనాపాలనా చూసేవారు లేరని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈసం గోవర్ధన్ (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా తన తండ్రి ఈసం రాము మద్యానికి బానిసై తన ఆలనాపాలన పట్టించుకోవడం లేదని కోపంతో గత కొంత కాలం క్రితం తన అమ్మమ్మగారి గ్రామమైన పడమట నర్సాపురానికి వెళ్లి వారి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేధనకు గురై జీవితంపై విరక్తి కలిగి నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని మరణించాడు. మృతుడి తల్లి ఈసం వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story