తాగిన మైకంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

by Sumithra |
తాగిన మైకంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, తలకొండపల్లి : గొర్రె అంజనేయులు ముదిరాజ్ (40) అనే వ్యక్తి అర్ధరాత్రి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. తలకొండపల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య జయమ్మ తన కుమారుడు మహేందర్ తో కలిసి హైదరాబాదులో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.

స్వస్థలంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆంజనేయులు గురువారం రాత్రి 9:00 ప్రాంతంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తాగిన మైకంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇరుగుపొరుగు వాళ్ళు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తలకొండపల్లి ఎస్సై వెంకటేష్ యాదవ్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed