- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియురాలిని ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం
దిశ, వెబ్ డెస్క్: ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియురాలిని బలత్కారం చేయబోయాడు ఓ ప్రియుడు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఆకాశ్ ముఖర్జీ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆయనకు అక్కడే ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య గట్టి ప్రేమ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గత బుధవారం ఆకాశ్ తన ప్రియురాలితో కలిసి బయటకు వెళ్లాడు. ఇద్దరు కలిసి ఛత్రపతి శివాజీ మహరాజు టెర్మినస్, గేట్ వే ఆఫ్ ఇండియా, గిర్ గావ్ చౌపట్టీ వంటి ప్రదేశాలు చూశారు. అనంతరం బాంద్రా బాండ్ స్టాండ్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఓ పెద్ద బండ రాయి చాటున కూర్చున్నారు.
ఈ క్రమంలోనే ఆకాశ్ ఆమెను కౌగిలించుకున్నాడు. అనంతరం ఆమెను లైంగికంగా అనుభవించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె నో చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆకాశ్ ఆమె తలను బండరాతికేసి కొట్టాడు. అనంతరం పక్కనే ఉన్న మురికి కాల్వలో తలను మంచి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే నొప్పిని తట్టుకోలేక ఆమె గట్టిగా అరవడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చి అతడిని వారించారు. అయినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి నుంచి ఆమెను కాపాడారు. అనంతరం ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ రేప కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు.