ఇనుప రేకులు మీద పడి వ్యక్తి మృతి..

by Sumithra |   ( Updated:2023-06-07 15:01:45.0  )
ఇనుప రేకులు మీద పడి  వ్యక్తి మృతి..
X

దిశ, ముషీరాబాద్ : భోలక్‌పూర్‌ మహాత్మానగర్ బస్తీ వద్ద బీఎం ట్రేడర్స్ లో షెడ్లను ( ఇనుప రేకులను) పక్కకు జరుపుతుండగా అందులో పనిచేసే దీన్ దయాల్ అనే యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన దీన్ దయాల్ (33) పొట్టకూటి కోసం వచ్చి హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతంలో నివసిస్తున్నాడు. భోలక్‌పూర్‌ మహాత్మానగర్ బస్తీవద్ద బీఎం ట్రేడర్స్ లో పనిచేస్తున్నాడు.

ఇదిలా ఉండగా బుధవారం ట్రేడర్స్ లో పాత ఇనుప రేకులను పక్కకు జరుపుతుండగా దీన్ దయాల్ ప్రమాదవశాత్తు రేకులకు, రేకులకు మధ్యన ఇరుక్కుపోయి కిందపడిపోయాడు. దీంతో రక్తస్రావం అయింది. అతని పై పడిన ఇనుప రేకులను తీసేందుకు స్థానికులు శ్రమించి అతన్ని గంట తర్వాత బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ముషీరాబాద్ పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story