- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎల్లమ్మ గుడి తాటి వనంలో భారీ అగ్నిప్రమాదం..
by Sumithra |

X
దిశ, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి తాటి వనంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మంటలు చెలరేగి తీవ్రనష్టం వాటిల్లింది. తాటి వనంలో భారీ అగ్నిప్రమాదం వలన వరికుప్పలు, పశుగ్రాసం, తాటి చెట్లు, వ్యవసాయ భావుల మోటార్ వైర్లు, పైపులు , టేకు చెట్లు, గీతా కార్మికులకు జీవనోపాధికి ఆధారమైన సుమారు 20కి పైగా తాటి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
గతంలో కూడా తాటి వనంలో నిప్పులు అంటుకున్నాయని, గౌడ కులస్తులకు సంబంధించిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు. అగ్ని ప్రమాదాలకు గురై పంటను కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Next Story