రాజధానిలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 100 మందికి గాయాలు!

by Satheesh |
రాజధానిలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 100 మందికి గాయాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ వేళ బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ భవనంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. దాదాపు మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ బృందాలతో సహయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు చోటు చేసుకోవడానికి గల కారణాలేంటన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story