బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

by Satheesh |   ( Updated:2023-02-15 10:54:42.0  )
బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పూరానా పూల్‌లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కూలర్ల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. నగరంలో చోటు చేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాద ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లోని డెక్కన్ స్పోర్ట్స్ మాల్ వేర్‌ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే.. నగరంలో రోజుకో ఘటన వెలుగు చూస్తుంది.

Advertisement

Next Story

Most Viewed