పబ్‌లో యువకుడితో మహిళా యూట్యూబర్.. ఆ రాత్రి ఆమె వేసిన ఛార్జ్ రూ.80 లక్షలు

by Nagaya |   ( Updated:2022-12-15 03:23:46.0  )
పబ్‌లో యువకుడితో మహిళా యూట్యూబర్.. ఆ రాత్రి ఆమె వేసిన ఛార్జ్ రూ.80 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ : అందానికి కొంచెం తెలివి ఉంటే చాలు.. కొందరు మహిళలు మోసాలకు పాల్పడటంలో దిట్టగా మారుతున్నారు. వాక్చాతుర్యం, కలగొలుపు తనం ఉంటే ఇక వారిని అదుపు చేయడం కష్టమే. తాజాగా ఇలాంటి మహిళే ఓ వ్యాపారవేత్తను నిండా ముంచేసింది. భారీగా డబ్బులు నొక్కేయడంతోపాటు బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. ఆమె ఓ యూట్యూబర్ కావడం గమనార్హం. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నమ్రా ఖదీర్, బేనీవాల్ భార్యభర్తలు. ఢిల్లీ్కి చెందిన వీళ్లు ఓ యూట్యూబ్‌ను నిర్వహిస్తున్నారు. లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉండటంతో ఆ చానల్ తన యాడ్ ఏజెన్సీని ప్రమోట్ చేయాలని బాద్‌సాపూర్‌కు చెందిన దినేష్ యాదవ్ యువకుడు సంప్రదించాడు. దీనికి నమ్రా ఖదీర్ రూ.2లక్షల ఛార్జ్ చేసింది. అలా వారి మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో దినేష్ యాదవ్ తరచూ యూట్యూబర్ నమ్రా ఖదీర్ ‌ను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో తన భర్తకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్రా ఖదీర్ ఆ యువకుడితో నమ్మబలికింది. ఆ తర్వాత ఆ దంపతుల ఆహ్వానం మేరకు క్లబ్‌కు వెళ్లాడు దినేశ్ యాదవ్. ఆ రాత్రి అక్కడే ఓ రూం బుక్ చేసుకోని ఉండిపోయారు.

అయితే ఉదయం దినేశ్ యాదవ్ నిద్రలేచేసరికి నమ్రా ఖదీర్ అతడి క్రెడిట్ కార్డ్స్, లక్షల విలువైన వాచ్ తీసుకుంది. ఆపై అత్యాచారం కేసు పెడతానని బ్లాక్ మెయిల్‌కు దిగింది. అలా అతడి నుంచి రూ.80లక్షల నగదు, విలువైన వస్తువులను తీసుకుంది. అయినా ఆమె నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో జరిగిన విషయం మొత్తం దినేశ్ యాదవ్ తన తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నమ్రా ఖదీర్ పోలీసుల అదుపులో ఉండగా.. ఆమె భర్త బేనీవాల్ పరారీలో ఉన్నాడు.

Also Read....

బెడ్ రూమ్‌లో మామ, చిన్నకోడలు రొమాన్స్.. అదే సీన్‌లో అత్త, పెద్ద కోడలు ఏం చేశారంటే..?

Advertisement

Next Story

Most Viewed