- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్లైన్ బెట్టింగ్ కు బలైన బీటెక్ విద్యార్థి
దిశ, వర్థన్నపేట: ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి, ఏడు లక్షలు అప్పులు చేసి, పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బత్తిని దేవేందర్ సంధ్య కుమారుడు గణేష్(22) హైదరాబాదులోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఏడు లక్షల రూపాయలు ఫ్రెండ్స్ వద్ద అప్పుగా తీసుకున్నాడు.. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నాడు. స్నేహితుల వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేక మనస్థాపం తో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఈనెల 23న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజు మృతి చెందాడు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పులు చేసి మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.