ఇంట్లో పార్క్ చేసిన బైక్ దగ్ధం

by Sridhar Babu |
ఇంట్లో పార్క్ చేసిన బైక్ దగ్ధం
X

దిశ, భిక్కనూరు : ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. మంటల వ్యాప్తికి పెంకుటిల్లు కూడా స్వల్పంగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ముదాం బాలరాజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే సోమవారం రాత్రి తన ఇంటి ముందు బైక్ ను పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు.

తెల్లారితే సంక్రాంతి పండుగ కావడంతో ఇంటికి వచ్చిన మనవలు, మనవరాళ్లు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తరువాత అంతా కలిసి నిద్రకు ఉపక్రమించారు. పొద్దు పోయాక గుర్తు తెలియని దుండగులు బైక్ కు నిప్పు పెట్టడంతో ఆ మంటల వ్యాప్తి పెంకుటిల్లుకు కూడా అంటుకుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి బాలరాజ్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చూడగా బైక్ పూర్తిగా దగ్ధమైంది. దాంతో బాధితుడు మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed