- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్కూల్ ఆటో, బైక్ ఢీ.. పలువురు విద్యార్ధులకు గాయాలు..
దిశ, తాండూరు రూరల్ : అతివేగంగా వస్తూ ద్విచక్రవాహనం స్కూల్ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యార్థులు తెలిపిన వివరాల్లోకెళితే జీవన్గి గ్రామానికి చెందిన విద్యార్థులు మండల కేంద్రంలో ఉన్న బ్రిలియంట్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజూలాగే విద్యార్ధులు సోమవారం స్కూల్ కి వెళ్లి సాయంత్రం ఆటోలో ఇంటికి వస్తున్నారు.
సరిగ్గా క్యాద్గిర్, గంగ్వార్ ప్రాంతానికి చేరుకోగానే అతివేగంగా వస్తున్న ద్విచక్రవాహం స్కూల్ ఆటో ను ఢీట్టిందన్నారు. దీంతో ఆటోలో ఉన్న విద్యార్థులకు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 12 మంది విద్యార్థులు ఉండగా, అందులో అభిరామ్, రిషి కుమార్, మేయ్య, విక్టోరియాలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్ ద్వారా తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.