7 కిలోల గంజాయి పట్టివేత.. 8 మంది అరెస్ట్

by Jakkula Mamatha |
7 కిలోల గంజాయి పట్టివేత.. 8 మంది అరెస్ట్
X

దిశ, నరసరావుపేట: గంజాయిని విక్రయిస్తున్న 8 మంది నిందితులను శనివారం అరెస్టు చేసి, వారి నుంచి 7 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ కే.నాగేశ్వరరావు తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎంవి చరణ్, ఎస్సై వంశీకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సమందర్ వలితో కలిసి డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఎస్ఎస్ఎన్ కాలేజ్ పక్కన ఉన్న స్మశాన వాటిక వద్ద గంజాయి విక్రయదారులను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ 13 లక్షలు ఉంటుందని తెలిపారు.

అలాగే దారి దోపిడీ కేసులో ఆదివారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరు ఓ మహిళ నుంచి 9 సవర్ల బంగారాన్ని, నగదును దారి దొంగతనం చేశారని, ఆ మొత్తాన్ని కూడా రికవరీ చేసి వారికి అప్పగించామన్నారు. ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నరసరావుపేటలో గంజాయి విక్రయాలతోపాటు, మరి ఇతర కల్తీలకు పాల్పడిన పోలీసులకు తెలియజేయాలన్నారు. అందుకు స్థానిక ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు. ఈ రెండు కేసులలో ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ సీఐ ఎంవి. చరణ్, ఎస్ ఐ పి. వంశీకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై షేక్.సమందర్ వలి, కానిస్టేబుల్ వీరాంజనేయులు, కోటేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed