ట్రాక్టర్-వ్యాన్ ఢీ.. 26 మంది సజీవ దహనం

by Mahesh |
ట్రాక్టర్-వ్యాన్ ఢీ.. 26 మంది సజీవ దహనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టామౌలిపాస్‌లో ఆదివారం ఉదయం ట్రాక్టర్-వ్యాన్ ఢీ కొనడంతో 26 మంది సజీవదహనమయ్యారు. ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు వాహనాలు రాష్ట్ర రాజధాని సి యు డాడ్ విక్టోరియా ప్రాంతంలో క్రాష్ అయ్యాయని, ఆపై మంటలు అంటుకున్నాయని తమౌలిపాస్ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని విధంగా ఉన్నాయి. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుకు చెందిన వ్యాన్‌గా గుర్తించారు. మృతుల దగ్గర ఐడి కార్డులతో వారు మెక్సికన్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed