ప్రహరి కూలి 20 గొర్రెలు మృతి..

by Sumithra |   ( Updated:2023-04-22 11:48:36.0  )
ప్రహరి కూలి 20 గొర్రెలు మృతి..
X

దిశ, చౌటుప్పల్ : శుక్రవారం రాత్రి భారీ ఈదుగాలులతో కురిసిన వర్షానికి చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ప్రహరి కూలింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పిల్లి రాజుకు చెందిన 20 గొర్రెలు మృతి చెందగా మరో 26 గొర్రెలు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఉన్న తన ఫ్లాట్ లో గొర్రెలను రోజు మాదిరిగానే ఉంచగా శుక్రవారం రాత్రి వచ్చిన భారీ ఈదురు గాలులకు ఆ గోడ పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల 50వేల రూపాయల నష్టం వాటిల్లిందని రాజు విలేకరులకు తెలిపారు. విషయం తెలుసుకున్న వెటర్నరీ డాక్టర్ శ్రవణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ గొర్రెలకు చికిత్స అందజేశారు. ఈ సందర్భంగా గొర్రెల కాపరి రాజు మాట్లాడుతూ తనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story