గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో దారుణం.. బాలికకు వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసిన విద్యార్థులు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-16 04:31:08.0  )
గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో దారుణం.. బాలికకు వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసిన విద్యార్థులు
X

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.. గచ్చిబౌలిలోని ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఫొటోలను సహచర విద్యార్థి మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. తనతో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశాడు. దీంతో బాలిక భయపడి అతను చెప్పినట్టు చేసింది. అయితే ఇదే సమయంలో ఆమెకు తెలియకుండా మరో విద్యార్థితో వీడియో రికార్డింగ్ చేయించాడు. మీరు ఏకాంతంగా గడిపిన వీడియో తమ దగ్గర ఉందంటూ మరో ఇద్దరు విద్యార్థులు కూడా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు.

తమతోనూ ఏకాంతంగా గడపాలని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టారు. వారి వద్ద నుండి ఫోన్ లాక్కున్న బాధిత విద్యార్థిని దానిని పగల గొట్టింది. దీంతో వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులు సెల్ ఫోన్ కొనివ్వాలంటూ బెదిరింపులకు దిగారు. అయితే అప్పటికే వీడియోలు రికార్డు చేసిన విద్యార్థి మరొక విద్యార్థికి పంపించాడు. తనను వేధింపులకు గురి చేస్తున్న ముగ్గురు విద్యార్థుల వ్యవహారాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read More..

Shocking: డబ్బుల కోసం యూరిన్ స్టోర్ చేసి.. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేసిందో తెలుసా?

ఆంటీ అన్నందుకు దమ్ముంటే పైకి రారా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. పొట్టు పొట్టుగా తిట్టిపోస్తున్న నెటిజన్...

Next Story