- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్, సెహ్వాగ్, లారా
దిశ, స్పోర్ట్స్ : సచిన్, సెహ్వాగ్, లారా, జాంటీ రోడ్స్, బ్రెట్ లీ వంటి దిగ్గజ క్రికెటర్లు మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. త్వరలో రాయ్‌పూర్‌లో జరుగనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో వీళ్లందరూ తమ తమ దేశాల తరపున బరిలోకి దిగనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరుతో గత ఏడాది ఒక టోర్నీ నిర్వహించారు. ప్రజలకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో 5 క్రికెట్ ఆడే దేశాల రిటైర్డ్ ప్లేయర్లతో ఈ టోర్నీ ప్రారంభించారు. గత ఏడాది ముంబయి, పూణే వేదికల్లో మార్చి 7 నుంచి 22 వరకు టోర్నీ నిర్వహించిన ఈ సిరీస్ కరోనా మహమ్మారి కారణంగా అర్దాంతరంగా నిలిచిపోయింది. నాలుగు మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించిన తర్వాత టోర్నీని వాయిదా వేశారు. దీంతో మిగిలిన మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్‌నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కు ఐసీసీతో పాటు బీసీసీఐ అనుమతి కూడా ఉన్నది.
ఇండియా లెజెండ్స్ జట్టు :
సచిన్ టెండుల్కర్ (కెప్టెన్), మహ్మద్ కైఫ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రవి గైక్వాడ్, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ బంగర్, సమీర్ దిఘే, సాయిరాజ్ బహతులే, మన్‌ప్రీత్ గోనీ, నోయల్ డేవిడ్