కరీంనగర్‌లో క్రిబ్ కో ఇథనాల్ పరిశ్రమ

by Sridhar Babu |
Boinapalli Vinod Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్‌లో క్రిబ్ కో ఇథనాల్ పరిశ్రమ స్థాపనకు యాజమాన్యం ముందుకొచ్చింది. జాతీయ స్థాయి ఎరువుల ఉత్పత్తి కీలక సంస్థ క్రిబ్ కో. నీటి లభ్యత ఉన్న మిడ్ మానేరు, ఎల్.ఎం.డీ. ప్రాంతాలు పరిశ్రమకు అనుకూలంగా ఉన్నాయి. అదే విధంగా వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండుతాయి. నీటి లభ్యత ఉండటంలో క్రిబ్ కో యాజమాన్యం భావించి పరిశ్రమ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో ఆదివారం హైదరాబాద్‌లోని ఆదివారం మంత్రుల నివాసంలో క్రిబ్ కో పరిశ్రమ యాజమాన్యం భేటి అయింది. పరిశ్రమ స్థాపనకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయసహకారాలు అందజేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనతో పాటు పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తుందన్నారు. అనంతరం క్రిబ్ కో బృందం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. కార్యక్రమంలో క్రిబ్ కో చైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ.ఎస్.ఆర్. ప్రసాద్‌తో పాటు టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed