శ్రీముఖి వెంటపడుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’..

by Shyam |
srimukhi crazy uncles trailer
X

దిశ, సినిమా : యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ‘క్రేజీ అంకుల్స్’ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌పై గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మించిన చిత్రానికి ఇ సత్తిబాబు డైరెక్టర్. ప్రముఖ రైటర్ డార్లింగ్ స్వామి కథ, మాటలు అందించిన చిత్రం ఈ నెల 19న విడుదల కానుండగా.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముగ్గురు మిత్రులు రాజు, రెడ్డి, రావు(ఆర్‌ఆర్‌ఆర్) నివాసముండే అపార్ట్‌మెంట్‌కు స్వీటీ అనే అమ్మాయి కొత్తగా వస్తుంది.

తనను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని భావించే ఈ ముగ్గురు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలో స్వీటీతో రిలేషన్ కోసం ఆమె పీఏతో డీల్ కుదుర్చుకుంటారు. ఫైనల్‌గా తాము అనుకున్నది సాధించారా? లేదా? అన్నదాన్ని కామిక్ వేలో ప్రజెంట్ చేశారు. ఈ నేపథ్యంలో.. హీరోయిన్ల కంటే పీఏల సంపాదన ఎక్కువంటూ బండ్ల గణేష్ పాత్ర ద్వారా సెటైరికల్‌గా చెప్పిన విధానం ఆకట్టుకుంది. పోసాని కృష్ణమురళి, హేమ తదితరులు నటిస్తున్న చిత్రానికి రఘు కుంచె స్వరాలు సమకూర్చారు.

Advertisement

Next Story

Most Viewed