- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలి
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలను పునరుద్ధరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆన్‌లాక్ 4.0లో భాగంగా ఆర్టీసీ బస్సులను నడుపుకోవచ్చని కేంద్రం సూచించినప్పటికీ మన రాష్ట్రంలో సర్వీసుల పునరుద్ధరణ చేయలేదని అందులో పేర్కొన్నారు. ప్రైవేట్ సర్వీసుల యజమాన్యాలు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నాయని, ఆర్టీసీ ఆదాయ రూట్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. దీర్ఘకాలం బస్సులు నడవకపోవడం వల్ల ఆర్టీసీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సర్వీసులను పునరుద్ధించాలని కోరారు.
Next Story