- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు మాకు అక్కెర లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో అతి తక్కువగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నప్పటికీ టెస్టుల సంఖ్య పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలే తప్పుల తడకగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. లక్షల కొద్దీ టెస్టులు చేసిన రాష్ట్రాలు ఆ గైడ్‌లైన్స్‌కు విరుద్దంగా చేసినట్లా..? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని కరోనా చికిత్సలు మొదలు పెట్టి లక్షలు పిండుకుంటున్నాయని, వాటిపై ప్రభుత్వ కంట్రోలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విస్తృతంగా కరోనా పరీక్షలు చేపట్టాలని కోరారు. కరోనా వైరస్ అదుపు చేసే వరకూ ప్రైవేట్ ఆసుప్రతులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తునట్టుగా కొవిడ్-19 చికిత్సలకు ప్రభుత్వమే రేట్లు నిర్ణయించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.