- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది’
దిశ, నల్లగొండ: విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఉత్పత్తి, పంపిణీ, టారిఫ్ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విద్యుత్ సవరణ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేస్తుందని, వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్ ఇకపై ఉండదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ఎండీ సలీమ్, సయ్యద్ హషం, పి.ప్రభావతి, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.