- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారు: సీపీఐ నారాయణ
దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకోని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, సయ్యద్ అజీజ్‌పాషాలతో కలిసి మంగళవారం గన్‌పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం మగ్ధూంభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో సీపీఐ కీలకంగా పనిచేసిందన్నారు. ఆంధ్రాలో సీపీఐ నేతల దిష్టిబొమ్మలు తగలబెట్టినప్పటికీ ఒకే మాటతో ఉద్యమించామని గుర్తుచేశారు. టీఆర్ఎస్‌తో కలిసి పనిచేశామని పేర్కొన్నారు. ఉద్యమంలో పోరాడిన గిరిజనుల పొట్టకొడుతూ పోడు వ్యవసాయానికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడుస్తున్నా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవాన్ని తుంగలో చాడ వెంకటరెడ్డి విమర్శించారు.