- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల అరెస్టు బాధాకరం..
సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో :
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు సాకుతో విధిస్తున్న కోతలపై రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తే పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన ద్వారా పలు అంశాలను వెల్లడించారు. ‘ఒక వైపు స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ తమది రైతుల ప్రభుత్వమని అంటూనే.. మరో పక్క రైతులను అరెస్టులు చేయించడం మోసపూరితమైన చర్య’ అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని తరుగుతో నిమిత్తం లేకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో గడిచిన ఆరేండ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో లక్షలాది మందికి రేషన్ కార్డులు అందలేదన్నారు. రేషన్ కార్డులకు అర్హులైన వారికి ప్రభుత్వం కార్డులు జారీ చేయకపోవడంతో పౌరసరఫరాల శాఖ నుంచి నిత్యావసర సరుకులు అందడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే రేషన్ కార్డులకు అర్హులైన వారందరికీ తాత్కాలిక కార్డులు మంజూరు చేయాలని చాడ డిమాండ్ చేశారు.
Tags: Farmers, Arrested, police, Kcr, Venkata Reddy, Cpi