- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ ఉపఎన్నికలో వాళ్లకు మాత్రమే ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సీపీ
దిశ, హుజురాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ జారీ చేసిన ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తామన్నారు.
ముఖ్యంగా హింసాత్మక పోలింగ్ బూతులు, ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి పోలీస్ ఉద్యోగికి డబుల్ వ్యాక్సినేషన్ అయి ఉండాలని.. వారిని మాత్రమే విధుల్లో కేటాయిస్తామని తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది.. ఏజెంట్లు డబుల్వ్యాక్సినేషన్ తీసుకొని ఉండాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పగడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి. అడిషల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ శ్రీనివాస్, ఏసీపీలు వెంకట్ రెడ్డి. పి శ్రీనివాస్. టౌన్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.